జానపదం
తేది: 23-01-2021
శీర్షిక: మాట వినర మల్లన్న ....
సంఖ్య : 594
మాట వినర మల్లన్న
పూట గడుసు సల్లంగ
నా మాట వినర మల్లన్నా
పూట గడుసు సల్లంగ // మాట//
పని పాటలు నేర్సుకొని
పయిలంగా బతుకురో
పిల్ల జల్ల సల్లగుండ
పిడికెడన్న దొరుకురో // మాట//
తోటోళ్ళ తోవ పట్టు.
పని మీద మనుసువెట్టు
నూకలన్న దొరుకుతయి
గంజికన్న డోకుండదు ...// మాట//
దినమంతా కూలి నాలి
దివ్యంగా జేత్తావు
ఒళ్ళంతా హునమైందని
ఓడగొట్టి తాగుతావు. // మాట//
ఏమికొచ్చే ఎందుకొచ్చే
మాటవినర మల్లన్న
రెక్కలు ముక్కలాయె
రొక్కమేమో దక్కపాయె // మాట//
తమ్ముడా మల్లన్నా
తల్లీ పిల్లలను
తనివి దీర అరుసుకోర // మాట//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment