Friday, July 23, 2021

చెల్లని నాణెం తేది 26-11-2020

 అంశం:చెల్లని నాణెం

తేది 26-11-2020
శీర్షిక: కాదేది అనర్హం ముగింపుకు... 
సంఖ్య : 572

మనిషెప్పుడూ నిరంతరాన్వేషి 
నిత్యనూతనల మేధోమధనం 
ఎల్లలెరుగని మేధో సంపత్తి 
ఎల్లెడలా ఆశావాది .... 

కాలం చాలా బలమైనది 
ప్రారంభం ఒక ప్రాభవం 
కాదేది అనర్హం ముగింపుకు 
కాలం కనుసన్నల్లో కనుమరుగు... 

ముఖ విలువల మారక విలువల 
కలబోతలే చిత్తూ బొత్తుల నాణెం 
మనిషైనా మరేదైనా కళ్ళకద్దుకున్నోళ్లే 
కాదు పొమ్మంటారు .... 

బాల్యమంతా బార్టరైతే ...
టంకశాల నూతన రంగుల 
నోట్ల ముద్రితమైన యవ్వనం ... 
ముదిమి వయసే ముగింపయే
చెల్లని నాణెం.... 

ప్రజలు మెచ్చని పాలకులు 
ఫలించని పలు ప్రయత్నాలు  
కాల మార్పుల్లో కనుమరుగయ్యే  
కలబోతల విలువలు .... 
అన్నీ కాలం (చెల్లిన) "చెల్లని నాణాలే "

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment