Monday, July 26, 2021

గణతంత్ర ఘనత* తేది: 26-01-2021

 గణతంత్ర ఘనత*

తేది: 26-01-2021
శీర్షిక:బ్రతుకు బ్రతుకనియ్యు..
సంఖ్య : 596

రణతంత్రమెరుగని గణతంత్రం మనది
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య,
గణతంత్రం ...... 
ఛాతీ పొంగు ప్రతి భారతీయుని మంత్రం 
విశ్వ వీధి గగనాన విరబూసే ధ్వజ యంత్రం..... 

మంచి మంచి మాటలు చిలుక పలుకులై
మన దేశం మన చట్టం వెలుగొందిన రోజు 
రెక్కలు విచ్చుకున్న పక్షి పిల్లలోలె
మనకు మనం మనమై నినదించిన రోజు 
మన నేల మన గాలి మన నీటి మీద 
ఏ కట్టుబాట్లు లేకుండా కనగలిగిన రోజు .....

ఎనమిది షెడ్యూళ్ళతోడ ప్రారంభమయి 
అనుభవాల సారాలను సమయానుకూలంగా
అవసరానా మార్పులతో అందిపుచ్చుకుంటూ
పదిరెండు షెడ్యూళ్ళతో  ఫరిఢవిల్లె నేడు
ప్రజారంజకంగా పాలనలకు సులువాయె చూడు..... 

ప్రకృతిలో పుట్టిన ప్రాణులకున్న స్వేచ్చలా
మతికి స్వేచ్ఛ.. మాటకు స్వేచ్ఛ..మతం స్వేచ్ఛ..
న్యాయానికి  ధర్మానికి సమానత్వమంటూ 
ప్రతి వ్యక్తికి నిష్ఠ..సమైక్యత సమగ్రతల నిష్ఠ..
ప్రాతిపదికన అవతరించె భారత రాజ్యాంగమై ..... 

పరిసరాల పరిశీలనలో మేటిగా 
పలు దేశాల చట్టాలను పదిలంగా 
పరికించి...మంచిని మాత్రం సంగ్రహించి..
మలుచుకున్న లిఖిత  రాజ్యాంగం ..
బ్రతుకూ... సాటి వారిని బ్రతుకనియ్యమంటూ ..


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment