అంశం: దేశభక్తి గేయం 2
తేది: 15-08-2020
శీర్షిక: అమ్మ లాంటి నా దేశం ...
సంఖ్య: 490
అమ్మ లాంటి నా దేశం
అందమైన భారతం
ఆత్మీయత అనురాగం
ఆసేతు హిమాచలం // అమ్మ //
సనాతన సంస్కృతిలో
సమున్నతం నా దేశం
సంప్రదాయ వారసత్వం
అద్వితీయ మహోన్నతం // అమ్మ //
తెల్లవారి దురహంతం
తెగ నరికిన ఉదంతం
అహింసా పరధర్మం
త్యాగధనుల స్వాతంత్య్రం // అమ్మ //
ఉత్తరాన హిమ శిఖరం
అందమైన ఆభరణం
ప్రకృతి సంపదలనేకం
జీవనదులు ఉన్న దేశం // అమ్మ //
కులమతాలకతీతం
బహు భాషల భిన్నత్వం
కలసి మెలసి జీవించే
కలహంసల స్వర్గతుల్యం // అమ్మ //
అశోకుని ధర్మ చక్రం
సంఘం శరణం గచ్చామి
మువ్వన్నెల పతాకం
పింగళి వెంకన్న రూపం. //అమ్మ//
రవీంద్రుని జాతీయ గీతం
జనగణ మన భారతీయం
బంకీమ్ చంద్రుని హారము
భావి భారత వందే మాతరం // అమ్మ //
నగునూరి రాజన్న
కరినగరం
No comments:
Post a Comment