Monday, July 26, 2021

మేఘము నీవే అనుకుని తేది: 25-01-2021

 మేఘము నీవే అనుకుని 

తేది: 25-01-2021
శీర్షిక: పొరపడ్డ జనం ..... 
సంఖ్య : 595

చిన్నా చితక పాయలన్నీ కలిసి 
పరుగున నది చేరిన చందము 
ఊరూర గర్జించి పట్టణము చేరి 
ఉరుమురిమి ఊరకుండే నాడు .... 

రగిలిన జనమంతా రంగు వెలిసి 
ముక్కిరి మూలిగిరి దిక్కులు తోచక
పిక్కటిల్లిన దిక్కులన్నీ బొక్క బోర్లాయే 
బక్క చచ్చిరి బతుకుబాటన ఆనాడు...... 

పడి లేచిన కెరటంలా నిలిచె 
ముప్పదేండ్లకు మళ్ళీ ఉద్యమమై..... 
నమ్మాలో నమ్మొద్దో నాయకుల్ని 
మీమాంసలో కొట్టుమిట్టాడే జనం....

నీళ్లు నిధులు నియమాకాలంటూ 
నియమాలెన్నో నియమించుకుని 
పట్టు విడుపులు ప్రదర్శిస్తూనే 
దశ దశకు మద్దతులు కూడగడ్తూ .....

దండి మార్చిగా... దద్దరిల్లె జనసందోహం  
సకల జనుల సమ్మెగా సమ్మోహనమై 
సర్వ శోభలు  సంతరించుకుని 
సమకూర్చుకునే స్వరాష్ట్రమై అడుగులు .... 

మేఘం ఉరిమి వర్షిస్తుందని 
మేను తలంపై మురిపిస్తుందని 
కోరుకున్న జనాలకు......
ఉద్యమం ఫెయిలయ్యినా 
పాసయ్యినా...ఫలాలు ప్రజలకందక
మేఘమై కురుస్తుందనుకున్నవారికి  
చేదు అనుభవాలు చెంత నిలుస్తుండె.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment