గాలి కబుర్లు
తేది 22-01-2021
శీర్షిక : మర్మకళ....
సంఖ్య: 593
పేరు చెప్పకోలేని పిరికిమోత్తనములో
ప్రతిష్టలకు భంగమనే బడాయిలో
ప్రతిఫలాపేక్షల పసలేని రాజకీయాలో
వక్రీకరించాలనే కపట పన్నాగాలో....
అనామకంగ ఊరేగుతాయి
అసలు వారికే కొసర్లు కలుపుతూ
నిజము నిలకడ మీద తెలిసేలోగా
అబద్దం ఠీవీగా ఊరేగి కొన్నిసార్లు
అయినవారి ఉసుర్లు తీసి
కుటుంబాలను రోడ్లకీడ్చి రచ్చలకు
కంటతడులకు కారణాలవుతాయి...
మంచి చెడులేవైనా
మర్మకళల గందరగోళాలే
ఎక్కువకెక్కువ చెడులు కోరినవే
తక్కువలోతక్కువ మంచి జరిగిన
దాఖలాలు తార్కాణాలు...
ప్రతి ఊరికి కొందరుంటారు
ఉలిపికట్టెల చరిత్రకారులు
ఉత్తపుణ్యానికి జనం బేజారయితే
ఉత్సాహపడి పండగ జరుపుకుంటారు ....
విజ్ఞత నెరిగిన వివేకులో
విచక్షణలెరిగిన పరిశీలకులో
ముందుచూపుల అనుభజ్ఞులో
కీలెరిగిన వాతలు పెట్టి పురిటిలోనే
సంధి కొట్టాలి.... బాధితులను
బలిపశువులు కాకుండా చూడాలి...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment