రాకోయి రాకోయి అనుకోని అతిథి
తేది :24-12-2020
శీర్షిక : గుప్తత గుర్తించేంత వరకు
వస్తూనే ఉంటా ....
సంఖ్య: 583
అదేంటి... ?
చేసే పనులకు తాళం తీసేసి
చెప్పే మాటల మాత్రం కట్టడి చేస్తా అంటే..
పొంతన లేకుండా మసలుకుంటుంటే
రాకోయి అన్నంత మాత్రాన ఆగిపోతానా!
నిరక్షరాస్యతల నిర్లిప్తతలను సైతం
కూడగట్టుకోవాలని భక్తిలో భయం
అనుభవ సారాలను ఆధ్యాత్మికతలో
ఆరోగ్య సూత్రాలను అనుబంధాల ఆత్మీయతలలో
అమర్చి కూర్చే కద మన ఆర్యులు!
ఆర్యుల మాటలను ఆవల పెట్టి
అక్షరాలా పాటించకపోగా
అపహాస్యాలాడుతూ ఆట పట్టిస్తూ
ఆనందిస్తున్న వేళ నేనెలా ఊరుకోగలను!
మంచికి ముందుండక పోయినా
చెడుకు వెంటనే చేరుకోవాలన్నట్లు
రూపం మార్చి .....వేషం మార్చి....
రూటు మార్చి.... మాట మార్చి ....
ఎప్పటినుండో వస్తూనే ఉన్నా ...
శుభ్రతలోనే సుందర ఆరోగ్యమని
మానవత్వంలోనే మహనీయతనని
గుప్తత మీరు గమనించేంత వరకు
అనుకోని అతిథిగా వస్తూనే ఉంటా !
ముందు ముందు కూడా వస్తూనే ఉంటా... !
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment