Sunday, July 25, 2021

సమస్యలు తేది: 23-12-2020

 అంశం: సమస్యలు 

తేది: 23-12-2020
సా స సంఖ్య: 66

మనిషి పుట్టుకకు ముందు 
పుట్టిన తదుపరి సావాసం చేస్తూనే
అడుగడుగున అడుగులు కలిపి
నీడలా వెంటాడుతూంటాయి....

అడుగులు కలుపుతూనే
నడకల దోస్తీ సమరం చేస్తూ 
సమస్యల వలలను చేదిస్తూ
పరుగులతో సాగవల్సిందే.... 

ఆటవికతలో అల్లుకున్న
సమస్యల  సాలెగూళ్ళని 
అధిగమించే అడుగుల్లోనే
నవనాగరికతకు రెక్కలు 
విప్పార్చింది.... 

అవసరాల అవపోషణలలో 
ఉత్పత్తుల సమతుల్యతలను 
ఉడతాభక్తిగా పరిష్కరించే 
క్రమములోనే  పారిశ్రామిక 
పతాకాన్ని ముద్దాడింది.... 

సమస్యల సమరంలో 
సతమతాల నిరాశలకు 
నిస్పృహాలకు తావులివ్వక 
నైపుణ్యాలకు పదును పెడుతూ 
పరిష్కారాల పథకాల నగారా మోగిస్తూ 
ప్రశాంత జీవన పయనం వైపు 
పరుగు లంఘించాల్సిందే ..... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment