Sunday, July 25, 2021

ఏమని చెప్పను... తేది: 26-12-2020

 ఏమని చెప్పను... 

తేది: 26-12-2020
ఏమని చెప్పను గురుడా... 
సంఖ్య: 67

ఏమని చెప్పను గురుడా 
ఎన్నని విప్పను నరుడా 

మనిషి కూడా మలినపు తిత్తే 
మలినం మనదైనా
మాటి మాటికి తాకమని
మలినమంటూ మిన్నకుండమని....
                              //ఏమని //
ఆచారాలన్ని అవపోషణలేనని
సంప్రదాయాలన్ని సంస్కారాలేనని
ఉరుకుల పరుగుల జీవితాన 
ఉనికిని మరిచి ప్రశ్నిస్తామని..... 
                                //ఏమని //
నీతి నియమం పక్కనపెట్టి 
కోతి చేష్టలే చేస్తుంటామని
న్యాయం ధర్మం చూడకుండ
కాలం వెల్లబుచ్చుతుంటామని....
                                  //ఏమని //
ముందున్న సమస్య మరిచిపోయి 
కిందటి మనువును ప్రశ్నిస్తామని
చేసినదానికి  వంకలు పెడుతూ 
చేష్టలుడిగి చూస్తూంటామని.....
                                   //ఏమని //
ఇల్లు వాకిలి గుల్లబారినా
ఆలి ముచ్చటే అక్కర్రాదని
మత్తువదలమని మొత్తుకుంటే  
సుత్తి సుత్తని తీసేస్తామని.....
                                //ఏమని //
అంటు ముట్లను హ హ్హంటు
అవహేళన చేసినోళ్లంతా
అబ్బురపడి సబ్బునీళ్ళను 
సుబ్బరంగా రుద్దుకున్నరని
                               //ఏమని //
కనపడిందల్లా నోట కరిస్తే 
కాటువేసే కదా కరోనాగా 
కంటికి తాను కనపడ పోగా 
కనువిప్పులు మనకు కలిగించెనని..... 
                              //ఏమని //
నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment