కంటికి కనబడని కాలుష్యం
తేది: 23-12-2020
శీర్షిక:
సంఖ్య: 583
ఊళ్ళో మనుషులున్నారనే ఉనికంటే
ఊళ్ల చుట్టూరా ఉండే మణిహారాలు
ఏ ఊరు చేరాలన్నా ముందు ఎత్తుపల్లాల
చిత్తడి కొండలు దాటితేనే కదా !
ఊరి పక్క కాలువో.. ఉరికి పారే
వాగో వంతో....కడకు కన్న తల్లి లాంటి
జీవనదో.... ఎక్కడ జూసినా
మనిషి అలసత్వాల జాడలే...
మస్తుగ పోసి నింపిన పాలిథీన్లు
మనం వాడేసిన ప్లాస్టిక్కు సీసాలు.....
పరిశ్రమల గాండ్రింపుల పలకరింపులు
పలు వాహనాల సకిలింతలు
పంటపొలాల అంటుబెట్టే
కంటకింపుల కండ్ల కలకలు...
పైవన్నీ ప్రత్యక్షమయినా ...
ఆత్మ సాక్షి లేని కొంతమంది
అధికారగణాల ఆగడాలు...
కొంగ జపాల కపటబాజి తనాలు
కోటి స్వార్ధపు సంచుల కొరకరాని కొయ్యలు
కరుణ కానరాని కసాయి పాలకులు...
మొత్తానికి పత్తా దొరకని
పట్టుకోరాని మనిషి తత్వం ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment