Thursday, July 22, 2021

లేనోడి పాలన కల 23-11-2020

 నగునూరి రాజన్న 

లేనోడి పాలన కల

యుగాలు మారినా జగాన తేజం 
రామ రాజ్యమే ఘన ఉదహరణం 
కాదెందుకో దృష్టాంతం కొందరికైనా 
కాసుల మీదే యావాయె అందరికి ...

అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం
అనేక రాజ్యాంగాల అవపోశనం  
అంబేద్కరుగారే జ్ఞాపక చిహ్నం   
అసలు మరచిన ఆనవాళ్లే సుమా .... 

రెక్కలు విచ్చుకున్న లిఖిత రాజ్యాంగం 
పేరుకు నామకంగా ప్రజాస్వామ్యం
పొడసూపుతున్న గోడల బీటలు 
డెబ్బదేండ్లకే ఉలి దెబ్బల పగుళ్లు....

పకడ్బందీగా పంక్తులు బిగించినా 
పేదోడికి పాలన కుర్చీ ఓ కలయింది
లేనోడికి పోటీలో నిలబడే వీలే లేదు
పెత్తనమంతా  పెట్టుబడిదారులదే.... 

అవాక్కయ్యే లక్షణాల ఆనవాళ్లు 
అటెండెంటుకైనా అక్షరజ్ఞానమే 
అందరిని పాలించే నాయకులకేమో
ఆర్హతల పట్టింపులు లేనే లేవాయే ...

వణికుల చేజారిన వాణిజ్యంలా
పలువురి ప్రవేశాలతో..పక్కదార్లు తొక్కి
నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చి
ప్రజారోగ్యాలకు హామీ లేని రక్షణకవచంలా.... 

రాజకీయాలే రాజ్యమేలుతున్నయి
కుటుంబాల వంతుల కుంభకోణాలై
కోట్లల్లో ఎన్నికల ఖర్చులు కౌన్సిలర్లకైనా
ప్రజాపాలనలన్ని పట్టు దప్పుతున్నయ్.... 

లెక్క లేనన్ని పార్టీలు..అభ్యర్థులు  
బొక్క బోర్లా పడుడే ఎన్నికల బొక్కసం 
ఎవరు పడితే వారు ఏది పడితే అదే 
నోటికొచ్చినదే పాపం... వ్యక్తిగతమా 
వ్యావహారికమా... మీమాంసలేవి .... 

అహం బ్రహ్మాస్మి పరకాయ ప్రవేశం 
లొసుగుల దండలో పూలన్నీ మాయం 
అనుభవాల సారం మూటగడితే 
అత్యంత శక్తి వంతమే ప్రజాస్వామ్యం 
అందుకు సాయం ఆ పరాశక్తి మహిమే ....  

రాజ్యాంగములో రాణులకు ఏబదంట 
రాబందుల్లా అడ్డగింపులే వీరూ..వారూ
అధికార పక్షమని ప్రతిపక్షం వారిపాట 
ప్రతిపక్షమేనని అధికార ప్రక్షం మాట
సాగతీతల సణుగుల్లే కానీ సరికిరారు ....

అవగాహన ఉన్నోడు ఆయుధమవ్వాలి  
అభివృద్ధికి చక్కని బాటలు వేయాలి 
అక్కున చేర్చుకోవాలి జన సామాన్యులను 
ఆదర్శమై నిలవాలి  రాజకీయ చరిత్రన .... 


నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment