రైతు కథలు
మంటిలో మానెడు ఇంటిలో
పుట్టేడని రైతే రాజన్న రివాజు
భూసారాల పరీక్షలు అభూతం
శాస్త్రీయతల సలహాలు హుళక్కే....
అప్పు చేసి పప్పు కూళ్ల భారీ ప్రాజెక్టులు
కాలువ సిమెంటుల కాంక్రీట్లు
కరంటు స్తంభాలు తీగల యతలు
కాట్రాక్టర్లకు టెండర్ల కమీషన్లు ....
విత్తనాల స్వతంత్ర్యత లేదు
ఎరువులకు రొక్కం అందదు
కమతానికి కఱ్ఱు నాగలి కరువు
కలుపు కూలీల కొలుపులు ...
బ్యాంకుల భద్రత శూన్యం
కష్టాలకు భీమా కదలదు
పనికి ఆహార పథకాల జోరు
ఎవుసం కూలీల ఎతుకులాటలు...
అతివృష్టి అనావృష్టిలు
అకాల వర్షాలు దాటుకుని
బాధల బాలారిష్టాలు తట్టుకుని
నాలుగు మాసాల పంటి బిగువున
కంటికి కునుకు తనువుకు విశ్రాంతి
అన్నీ మరిచి ఆత్రంగా ఎదురు చూపులు ....
ఇన్ని దాటుకుని ఇగురంగ వస్తే
ఇక్కడంటే అక్కడని కొనుగోళ్లు
పంట ధరలు నిర్ణయించుకునే
పరువు మిగలని బతుకులు ....
ఎండుకం సరిపోదంటూ
మాయిస్చర్ మోతాదులని
కిందికంటే మీదికని
మీదికంటే కిందికనీ
రైతు బతుకంతా ఎతల కథలే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment