విజయగీతాలు
తేది: 21-11-2020
శీర్షిక: యువతా మేలుకో....
సంఖ్య: 568
యువతా మేలుకో
భవిత నీదేనని తెలుసుకో
అక్షరాల పూదోటల్లో
లక్షణమైన రాంకులు
యోగ్యతల కొలమానంలో
భాగ్యతలు నీ సొంతం...
సంశయాలు వదిలేయి //యు//
విశ్వ గమనం వీక్షించు
దేశ భవితను గమనించు
ప్రాంతాలను రక్షించు
తోటి మనిషిని గుర్తించు
సాటి మనుషుల సన్నుతించు //యు//
ప్రజలంటే పవిత్రమని
పాలనలొక యజ్ఞమని
నిస్స్వార్థపు నీడలలో
బంధు ప్రీతి విడనాడి
సమాజమే దేవలంగా.
సాగిపో యువతా //యు//
విజ్ఞుల మౌనం
వినాశనాలకు నాంది
విచ్చిన్నాలకు పునాది
విపరీతాలకు రహదారి
వింత గొలుపు నిర్మానుశ్యమై
విధి రాతలను మార్చండి //యు//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment