శ్రమ విలువ
తేది:21-01-2021
సంఖ్య: 75
జడలు విరబోసుకున్న
ఆకలి రక్కసి పేగులను
పొర్లిస్తూ నిలువెల్ల కెలుకుతూ
గందర గోళం సృష్టిస్తుంటే
ఇంక ధరవరల ఊసులెక్కడివి?
న్యాయాన్యాయాల బేరీజుల
ప్రశ్నే ఉత్పన్నం కాదుగదా....!
అసలే ప్రామాణికతల
కొలమానం లేని సేవలు
ఆపైన అడ్డమైన వ్యాపారుల
దళారీల దమన నీతులు....!
నిరక్షరాస్యతల నీలినీడలు
నిలదీయలేని దైన్యతలు
సాటి వారి సహాయ నిరాకరణలు
జాడ తెలియని ధర్మం చిరునామాలు ....!
నాయకుడు కాకముందు నుండే
బిర్యానీ పొట్లాలకు బీరు సీసాలకు
బేరం పెట్టి శ్రామికుల తలరాతలను
నలిపి కాల రాస్తున్న కథలెన్నో .... !
పాలకులయ్యాక కూడా పట్టు
తప్పి పోతుందేమోనని...
సర్కారు చదువు లందకుండా
సదురుకొని.... మత్తులే గమ్మత్తుగ
భావించుకోవాలని తగిన
ఏర్పాట్లన్నీ తకురారుగా జేస్తుండే....!
ఇన్ని దాటుకుని ఇకమతుగా
ఎవ్వరైనా ముందుకొచ్చినా....
చట్టాలలో లొసుగులన్నీ చుట్టాలకే
పరాయోళ్లకన్నా ముందుగా సర్కారే
సవాలక్ష కట్టుదిట్టాలాయె ......!
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment