Thursday, July 22, 2021

పయనం ఎటువైపు తేది: 21-11-2020

 అంశం: పయనం ఎటువైపు

తేది: 21-11-2020
శీర్షిక: బ్లాక్ మెయిల్ రాజకీయాలు.... 
సంఖ్య: 48

సంపదలను తృణీకరించి 
స్వార్థాలకు అర్ఘ్యమిచ్చి
ప్రాణాలను  ఫణముగ పెట్టి
రొమ్ము విరిచి తూటాలకు ఎదురొడ్డి 
న్యాయాలను హత్తుకుని 
ధర్మాలను ఎత్తుకుని
మనస్సాక్షికి  కట్టుబడి 
వాక్శీలతల నమ్ముకుని 
స్వాతంత్య్రం సాధించి 
గణతంత్రం పంచినారు 
గతించిన నాయకులెంతోమంది ... 

కుప్పలే తెప్పలైన కులాసాలు 
కుల పిచ్చులు ముదిరిపోయి  
వాపులే బలుపులనుకుని 
మంచిచెడులు మైమరచి 
రచ్చకెక్కుతున్న రాజకీయాలే... నేడు 

ఓట్ల పండగలనగానే
ఒళ్ళు మరిచి జల్లుమనే 
మాటలు తూటాలుగా 
పేలుస్తూ కన్నుమిన్ను కానకుండ
మాకోటేస్తారా లేదా అంటూ 
బరితెగించి బ్లాకుమేళ్లంటుంటే 
ఎటుపోతోందీ ప్రజాస్వామ్యం
ఏమౌతుందీ  భారతం .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment