అంశం: మూల మలుపు
తేది : 21-01-2021
శీర్షిక: మంచివే.....
సంఖ్య: 592
మూలమలుపుల దారులు
ఏకాగ్రతల హెచ్చరికల చురుకలు
నూతన మలుపుల జీవితం
అందమైన ఆనందాల హరివిల్లు....
ఆటవికతలనుండి నాగరికతలో
అడుగువేసిన ఆదిమానవునికి
ఎదురైన అనుభవాల పొత్తిళ్ళలా
నిత్యజీవన సమరంలో కూడా
అడుగడుగున వేరు వేరు రూపమైనా
ఎదురయ్యే కష్టనష్టాల కాలాలను
అనుభవించి అధిగమిస్తే గానీ
ఆవిష్కరించుకోలేము నూతనత్వం.....
బాల విద్యార్థి బతుకు మోసే
బాటసారి కావాలంటే సంధి
కాలాలను సంస్కరించుకున్నట్టే ....
ప్రతి పనిలో ఫలితాలు చేరుకోవాలంటే
ప్రణాళికల నుండి అమలు దశలు చేరి
తుది రూపం తీర్చి దిద్దుకోవాలంటే
తప్పదు దేనికయినా
ప్రసవ వేదనల పరితపనలు ....
వివేకమై వివేచనలతో మసలుకుంటే
మలుపులన్నీ మంచివే......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment