సిగ్గు పడిన శశిరం
తేది: 20-01-2021
శీర్షిక: కాల ధర్మం
సంఖ్య : 591
కాల చక్ర గమనమెప్పుడూ
పురోగమనమే......
కాదనే ధైర్యం చేయలేము మనం
కరాకండిగ సాధించుకునే కాలధర్మపు
కమనీయత ఒంట బడితేనే సుఖాంతం...
ఋతువులు గతులు మార్చుకున్నా
బతుకు పైన ఆశలే ప్రకృతిలోని చెట్లకు
అప్పుడే ఆనందం ... ఎదురు చూపులు
మళ్ళీ ఆనందాలు నింపుకుని వంపుకుని....
కొంగోత్తగా రెక్కలు విచ్చుకుంటున్న పక్షిలా
రెప రెప లాడించి విజయం సాధించిన
చందంగా శిశిరంలో పండి రాల్చిన ఆకు
వసంతములో మళ్ళీ కొత్త ఆశల చిగుళ్లతో
అలరారుతుంది.....
పాత తరం...కాలమోలే
హుందాగా కదిలిపోతేనే
కొత్త తరం వసంతాల
సంతోషాలతో చేరేది ....
ఈనాటి వసంతం కూడా
రేపటి శశిరమై పోతుంది
మళ్ళీ కాలచక్రంలో కదిలే
సిగ్గుపడిన శశిరమె
ఎవరికైనా శరణమౌతుంది....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment