Thursday, July 22, 2021

తెలుసా మనసా తేది: 20-11-2020

 అంశం: తెలుసా మనసా 

తేది: 20-11-2020
శీర్షిక: మనస్సాక్షి....
సంఖ్య: 47

తెలుసా మనసా అనడమే 
తెలియని తనానినికి సంకేతం 
ప్రశ్నించడమంటేనే పరిహాసం 
అపోహల పల్లకిలో ఊరేగడం .... 

మది గది గోడలలో కదిలే చెమ్మను
అంకురమయ్యే ప్రతి ఆలోచనను 
ఆచరించే ప్రతి మంచి చెడులను 
మనన నిమిషాన పసిగట్టే సిపాయి .... 

దాచలేని రహస్యాల సందర్శిని
మనిషికన్నా వేగంగా స్పందించే 
అనంతమైన అంతర్ వేగుకు 
అడిగి తెలుసుకునే అవకాశమా..... ? 

మదించినా పట్టుకోలేని మతలబులకు 
మహిలో కలదే మనిషికి దొరికే తావు
మరెంతో రక్షితం... సురక్షితం అంటూ
మనస్సాక్షిని మించిన న్యాయమూర్తి .... 

పాపాయిలకు మాత్రమే పదిలం
ఆటాపాటల్లోనా అనువుగ
దాని బారిన పడినా లేదా 
అనుపానుల ఆనవాళ్లు తెలియక ....

నగునూరి రాజన్న 
కరినగరము. 

No comments:

Post a Comment