Thursday, July 22, 2021

మాయ తేది: 19-11-2020

 అంశం: మాయ 

తేది: 19-11-2020
శీర్షిక: ఓట్ల పండగ ఓ పెద్దమాయ...
సంఖ్య: 46

ఓట్ల పండగ వచ్చిందంటే 
ఓటర్లంతా దేవుళ్ళైపోతారు 
మానిఫెస్టోలన్నీ మహోన్నతమై 
మచ్చుకు చేసే మ్యాజిక్కులెన్నో .... 

ధవళ వస్త్రాల కార్యకర్తలతో
జనజాతరల కూటములు 
అందరూ నావారేనంటూ 
ఆదరాభిమానాల ప్రదర్శనలు.... 

అలవికాని అందలాల ఆశలు 
ఊదరగొట్టే ప్రలోభాలతో 
ఉసూరుమనే ప్రచారాలు 
మన పన్నులు మనకే రాయితీలంటూ... 

క్రియాశీల కార్యకర్తల పోషణకై 
ఉత్తి పుణ్యానికే లెక్కల్లో రాకుండ
వేర్వేరు పేర్లతో  వేతనాలంటూ 
అసలు అర్హులకు అందకుండ జాగ్రత్త... 

నోటున్నోళ్లే నాట్యమయూరాలు 
ఓటికుండలది ఒడువని ముచ్చట 
ఓటుకు నోటిస్తూ ఒట్టేయించుకుంటరు
ఓటుతో గెలిచాక మడత పెట్టేస్తారు.... 
ఓట్ల పండగంటేనే ఓ పెద్దమాయ.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment