Thursday, July 22, 2021

పుష్కరాలు తేది: 20-11-2020

 పుష్కరాలు 

తేది: 20-11-2020
శీర్షిక: శాస్త్రీయ ఆచారాలు .... 
సంఖ్య:  567

అత్యవసరాలలో ఆది రెండవదయినా
అవును మనిషికి “జలమే” బతుకు భరోసా 
బలము నడకలు నేర్పిన నాగరికత 
బాటలు వేసే బంగారు భవిష్యత్తు .... 

ఆచార సంప్రదాయాలన్నీ 
ఆధ్యాత్మికతను అక్కున చేర్చుకున్నా 
అవపోశనపట్టిన అనుభవాలే 
ఆరోగ్య సూత్రాలాయె ప్రధానం... 

ఆయానాల మార్పుల్లో 
అంతర్గత జలనిధులు 
గమనాలు మార్చుకుని 
గుప్తంగా కూర్చు ఓషధులు
గమ్యాలు చేరేదే శాస్త్రీయం... 

రాశులవారీ బృహస్పతి సంచారమే 
మనదేశ నదుల పుష్కరాలని 
కాల గణకులు ఘనాపాఠీలు 
కాముగ నిర్ణయించిన పర్వ దినములు... 

నదీనదముల బాగోగులు చూడ
ఆడపడుచులుగ అన్వయించుకుని
వాయనాలివ్వడం గౌరవసూచకం
పితృదేవతలకు తర్పణాలతో 
స్వకార్యం స్వామి కార్యం ......

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment