స్వాగతాల రెప్పలు
సహోదరులు.....
తేది: 20-01-2021
సంఖ్య: 74
తూరుపు మెలకువలతో
తుంటరి రెప్పల తలుపులు
తెరుచుకోగానే మొదలయ్యే
తిప్పల తీతల మూతల మోతలు .....
తన్మయత్వమై చూపు నిలుపుకుంటే
తటపటాయిస్తాయి మూసుకోవడానికి
కోపంతో ఊగిపోతే కొండంత
స్థలమిస్తాయి తెరుచుకోడానికి
.....
ఆనందముతో ఉబ్బితబ్బిబ్బయితే
అల్లారు ముద్దులొలక బోస్తాయి
అలుముకుని అమురుకుంటాయి
అలుపెరుగక చూసే నయనేంద్రియాలకు
నగారా మోగించే నవదూతలు.....
నవరసాలను ఒక్క చూపులో
ఇముడ్చుకున్న నటనా సార్వభౌములు
కన్నుగప్పి వచ్చే శత్రుమూకల
భరతంపట్టే ధీరోదాత్తలు .....
కనిపెట్టుక నిలిచే కవలసోదరులు
విరామమెరుగని విచిత్ర వీరులు
సదా వెన్నంటి నిలిచే కార్యకర్తలు
కాలం ఆటుపోట్లలో వచ్చే
కష్ట సుఖాలకు కలిసి మెలిసి
స్వాగతాలు చెప్పే సహోదరులు.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment