అక్షర చరిత్ర
తేది: 19-01-2021
శీర్షిక: అక్షయమైనది
సంఖ్య: 73
భావ మార్పిడి బాటకు
భాషే ప్రధాన ఊతము
భాష ఉంటేనే బతుకు నిలుచు
భాష వల్లనే జీవుల్లో ఉన్నతి......
జనులను జాగృత పరుచ
జాతికి జవసత్వాలు నింప
జగతికి భాష కీలకము గాదె
మనుషులందరిని ఒకటిగ నిలుప....
జాతికి జవసత్వాలు నింప
జగతికి భాష కీలకము గాదె
మనుషులందరిని ఒకటిగ నిలుప....
ఆరేడు శతాబ్దాల నాటి
ఆధారాల లభ్యంతో ....
"నాగబు" పదంతో నగారా
మోగించి......
మరాఠా గాథాసప్తశతి లో
ఆనవాళ్లు పూయించి ....
పదకొండవ శతాబ్దము నుండి
గ్రంథస్థమై వికసించి .....
వెలుగులీనినది మన తెలుగు....
దేవాలయ కుడ్యాలపై దర్శించినా
శాసనాలలో అధికారాన్ని గర్జించినా
జనపదులలో జానపదమై నిలిచినా
గ్రంథాలలో నిలిచి జ్ఞానం పంచినా.....
నాటి నుండి నేటి వరకు
ఇసుకమీద పయనించినా
కట్టె పలకలపై కవ్విoచినా
మాండలికమై శోభించినా ....
అక్షయమైనది అమృత సమమైనది
అక్షరం.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment