అంశం: దేశభక్తి గేయం
తేది: 15-08-2020
శీర్షిక: అమ్మ లాంటి నా దేశం ...
సంఖ్య: 490
అమ్మ లాంటి నా దేశం
అందమైన భారతం
ఆత్మీయత అనురాగాల
ఆసేతు హిమాచలం // అమ్మ //
సంస్కృతీ సంప్రదాయం
సమున్నత శిఖరము
సనాతన వారసత్వం
అద్వితీయ మహోన్నతం // అమ్మ //
త్యాగధనుల స్వాతంత్య్రం
తపోధనుల భారతం
మన ఉనికి పరిసరం
మహిమాన్విత అనన్యం // అమ్మ //
మన క్షేమం మనవృద్ది
మనుగడల కోసమై
మన చేతిన ఓటేనని
మనసు పెట్టి నమ్మండి //అమ్మ //
జనమంతా మేలుకోండి
జనహితం తెలియరండి
స్వార్థం లేని నాయకుల
సన్నుతించి కీర్తించండి. // అమ్మ //
అచంచల విశ్వాసం
అవిభాజ్య భారతం
భిన్నతలో ఏకత్వం
మన సమైక్య భారతం // అమ్మ //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment