ఆరడుగులు
తేది: 19-11-2020
శీర్షిక: అనుభవాల ఆచారాలు
సంఖ్య: 566
అనుభవాల ఆచారాలు
అటకెక్కించి ఊరేగడం
సమున్నత సంప్రదాయాలు
సందేహాల కొక్కేలకు వేలాడేయడం....
కసురుకున్న అంటుముట్టు గుట్టే
కాపాడుతుండె మన జీవితాలను ..
అసహ్యించుకున్న అంటరానితనమే
ఆలంబనాయె శ్రీరామ రక్షగ ఈనాడు ..
కళ్ళముందు కదలాడే వాటికీ
కలికాలంలో సాక్ష్యాలనవసరం
కాటికి కబళించుకు పోతున్నా
కసాయిలనే నమ్ముకున్న గొర్రెల్లా....
ఎదురులేదు బొదురులేదు నాకంటూ
ఎదురైనదెల్ల తిన్న ఫలితములే కద
ఎల్ల విశ్వము నేడు గొల్లుమనుచుండె
కులమతాల కుత్సితాలకంటె క్రూరముగ
ఏకాకులను చేసి ఎగతాళి చేయుచుండె...
ఆరడుగులు అరడుగై
కత్తి మెడపైన వేలాడదీస్తూ
కనికరాలెరుగని కొంతమంది
కునుకు లేకుండా చేస్తున్నారు...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment