మీరే మాకు ఆదర్శం
తేది: 17-11-2020
శీర్షిక: ధరణీ మాత
సంఖ్య: 564
ఎండలు దండిగ ఎదురైనా
ధీరోదాత్తవై ఎదురుచూస్తావు
వానలు మెండుగ కురిసినా
అందాలను ఆరబోసుకుని పంచేస్తావు!
తొలకరి చేరి పలకరించగానే
పచ్చ తివాచీలు పరుచుకుని
మరకత శోభలు సంతరించుకుని
పరమానందాలు పంచే గుణం ...
చెట్టు చెట్టుకో రూపం
చేమ చేమకో అందం
కొమ్మ కొమ్మకో సుందరం
చెద పట్టి చెడినా కానని కోపం...
పూవు పూవుకో భిన్న వర్ణం
పుణికి పుచ్చుకున్న సప్త వర్ణం
సువాసనల్లో కూడా భిన్న మధురం
సుందరమౌ చూపులకు యదార్థం ...
పండు పండుకో రుచిని పెంచుకుని
ఏకత్వములో భిన్నత్వం ఇముడ్చుకుని
షడ్రుచులను సమున్నతంగా నింపుకుని
ఆనందాలను సమంగా పంచే పూర్ణత్వం...
సాధు స్వభావులకైనా కౄర జాతులకైనా
బేధ భావములు ప్రదర్శించక జీవారాశి
సమస్తం సమమేనన్న సమున్నత
స్థితప్రజ్ఞతల ప్రదర్శనల బుద్ధిశాలి
ధరణీ మాత నీవె మాకు ఆదర్శం ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment