Monday, July 26, 2021

ప్రకృతి శాపంకాదు.... తేది:19-01-2021

 ప్రకృతి శాపంకాదు.... 

తేది:19-01-2021
శీర్షిక: ఆలంభన..... 
సంఖ్య : 590

పరిహాసానికి కూడా ఓ హద్దుండాలి
పంచభూతాలమయమైన జీవరాశికి
ప్రాణాధారమైన ప్రకృతెలా శాపం? 
అడుగడుగున గొడుగయ్యే ఆలంభన ..... 

ప్రకృతో.... ప్రకృతో .......అంటూ 
పండ్ల బుట్టలా నెత్తిన పెట్టుకుంటే
నీకూ  నాకూ తప్ప...మూడోవాని 
కంటిన పడదు చెవిన కెక్కదు ......

పందికొక్కులై తోడుకుంటుంటే  
ప్రేక్షుకులైన పాల కంకులు 
పనికిరాని అధికార లెక్కలు 
ఎటుపోతుందీ పద్ధతిన ..... 

పరితపించిన మాతృమూర్తులు 
ప్రకృతి వైభవాన్ని పాలల్లో రంగరించాలి 
ఘోషించే పితృమూర్తులు 
పంచ భూతాల ప్రాశస్త్యం 
పలువలుగా తేట తెల్ల పరచాలి.... 

అడుగడుగున అమృతమయంగా
అవపోషణ పట్టాలి అక్షర సేద్యులు... 
సంఘం తనవంతు ధ్యానంగా.... 
మనిషి మనిషికి నర నరాన సాంతంగా
మత్తుమందులా ఎక్కించాలి ప్రకృతిపై ప్రేమ..... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment