Thursday, July 22, 2021

నాగుల చవితి తేది: 18-11-2020

 నాగుల చవితి

తేది: 18-11-2020
శీర్షిక: పూజనీయం... 
సంఖ్య:  565

ప్రకృతిలో పరవశించే  ప్రతి అణువు 
జీవనాధారమే మనిషి మనుగడకు 
వాగు వంక రాయి రప్ప చెట్టు చేమ పుట్ట 
కొండా కోనా గుట్ట నది అన్నీ కలిస్తేనే ..... 

కొన్ని ప్రత్యక్షమైతే  కొన్ని పరోక్షం 
కొన్ని ప్రధానమైతే  కొన్ని అల్పం 
ఏదేమైనా అన్నింటిని కలుపుకుని  
ఆనందంగా జీవించడమే సుందరం... 

భూసారానికి భూరి సాయం 
నీటి సమృద్ధతకు సంకేతం 
పంట కీటకాలకు భరతం 
హాలికునికి ఆపన్న హస్తం ... సర్పం... 

నవరంధ్రాల మేను వల్మీకంలో 
కామక్రోధ లోభ మోహ మద 
మాత్సర్యాలనే విషాలను పారద్రోలి 
సత్వగుణ సంపత్తిని పెంచు...దాసోహం

శివుని మెడలోనిలిచిన ఆభరణం 
సంతాన సంపత్తికి  పూజనీయం 
సంస్కృతి సంప్రదాయాలకు 
సన్నుతమే ప్రతీది హైందవాన  .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment