అంశం: ఎవడి గోల వాడిదే
తేది: 17-11-2020
శీర్షిక: మళ్ళీ మొదటికేనా అడుగు
సంఖ్య: 44
అవును మళ్ళీ మొదటికేనా అడుగు
భూమి గుండ్రమన్నంత నిజం
ఆటవిక ఆవాసం భాష లేని బతుకు
భావం చేరవేయలేని మౌనం ....
సాటి మనిషిని గౌరవిస్తూ
సంఘమై కలిసి మెలిసి
సౌభ్రాతృత్వంతో వర్ధిల్లుతూ
సంతసాలను పంచుకునే ....
చక్రం పనిముట్లతో
చెంగు చెంగున అడుగులేసి
పోడు ఎవుసం పొందికతో
నాగరికతల నడక నేర్చే....
బార్టర్ బాలారిష్టాలధిగమించి
పారిశ్రామికీకరణలకు పట్టం కట్టి
సాంకేతికాల సరిహద్దులు చెరిపి
అంకాత్మకతలో అడుగిడె మానవుడు .....
ఖండాంతరాలు దాటి గ్రహాంతరాల
శోధనలో కాల గమనాలను చేదిస్తూ
దశదిశలు నావేనంటూ..ఎవడిగోల
వాడిదని చెప్పకనే చెబుతూ ..
సాటి మనిషిని సైతం మరిచిపోతున్నాడు .......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment