Thursday, July 22, 2021

మీరే మాకు ఆదర్శం -2 Dt. 17-11-2020

 మీరే మాకు ఆదర్శం 

తేది: 17-11-2020
శీర్షిక: 
సంఖ్య:  564

ఆత్మీయతలను అవపోశనపట్టి 
ఆప్యాయతలను రంగరించే 
అమ్మానాన్నల ఒడే కద 
మనందరికీ ఆది బడి .... 

అనుపానులను విశదపరిచి 
మంచి చెడుల మతలబులను 
బోధించి మనుషులుగ నిలిపింది 
గురువులే  కద.... 

పంచమన్న సంస్కృతిని 
పరమ విశిష్టoగా బోధించే 
ప్రకృతిలోని ప్రతి అణువే   
కదా మనకు  ఆదర్శము  ... 

ఎంతో నేర్చుకున్నామని గర్వం ...అయినా 
ఎనలేని పిచ్చుక నైపుణ్యం 
నారలన్నీ పోగేసి గూడు నేత 
పిసరంత కూడా నేర్వలేని 
గూడైనా కట్టలేనితనం... 

అతలా కుతలం చేసే సునామీని 
పశువులు పక్షులు  ముందే కనిపెట్టినా ... 
అపార ఙ్ఞాన సంపన్నత భ్రమలో 
మనకు మనమే వెనకబాటుతనం ....  

అందుకే అంటాను .... 
ప్రకృతిలోని  ప్రతీది...  
కాల మాన పరిస్థితులు  కలిసిన 
వీరంతా మనకాదర్శం 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment