పుస్తక పఠనం
తేది: 17-12-2020
మార్గదర్శకాలు
పఠనం లోన పట్టు దొరికితే
పుట్ట తేనె గుట్ట మాదిరే కదా
ప్రపంచం తలకిందులైనా
పరిసరాల కలిసి రాక పోయినా ...
నిశ్చయంగ లీనమైతే
నిర్మలమై మనసుకు హాయి
నీరాజనాల హారతులు
నిండైన జ్ఞాన సంపదకు ....
మౌనమే భాషై సంభాషిస్తుంది
మనసున మొక్కై నిలుస్తుంది
మనన నిమిషాన మనలను
మరో ప్రపంచాన నిలుపుతుంది ....
విసుగు విచారాలను
విసిరేస్తుంది ఆవలకు
అంకురమై మొలిచే
ఆలోచనలకు నాంది
పలుకుతుంది......
చరిత్రలకు భాండాగారమై
భవిష్యత్తుకు చుక్కానిగా
బ్రతుకున మార్గదర్శకాలై
నాగరికతకు నడకలు జోడించు....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment