Sunday, July 25, 2021

పదాల కవిత : తేదీ: 13-12-2020

 పదాల కవిత : 

ఇరుకు, అసమానత, తరగని, 
సీతాకోకచిలుకలు..... 
తేదీ: 13-12-2020
స. సంఖ్య :  64 


అందమైన వింతలన్నీ 
అక్కడే తిష్టవేసినట్టు 
ఆకట్టుకుని అమరుతుంది 
అందాల భరిణయై .... 

అందానికే అందాలనద్దుతూ 
సుందరమైన సహజ వనరుల
కొండలు కోనలు లోయలతో 
అహ్లాదాలను పంచుతూ అలరించు.... 

ఇరుకైన రహదారులు 
ఇముడ్చుకున్న సొరంగాలు 
ఇంపైన అసమాన సౌందర్యాలను
ఇమ్మడించుకునే  ముచ్చట్లు ... 

తర తరాల తరగని గని 
భూలోక  స్వర్గమై భాసిల్లుచుండె 
భువిన వెలసిన బంగారు 
భువన మోహనమై సింగారించుకున్న 
అందాలతో సిరులగని అరకు ..... 

కాంచినంతనే కనులకు 
కలిగిన కమనీయతలకు 
మేను పులకరించె రంగురంగుల 
సీతాకోకచిలుకల సమూహమై .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment