జానపద గేయం
తేది: 19-12-2020
ఎములాడ రాజన్న
సంఖ్య: 582
ఎంకి మనం ఎల్దామె
ఎములాడా జాతరకు
ఎడ్లబండి గట్టుకుని
సద్ది ముల్లె సదురుకుని
కొంటెతనం బాపుమని
సంటోడు సల్లగుండ...
// ఎంకి //
గుండంలో స్నానమాడి
గండములే బాపుమని
గండదీపమెలిగించి
దండిగా మొక్కుదామె
// ఎంకి//
గణపతికి మొక్కి మనం
గంటకొట్టి అడుగుదాం
పిల్ల పాప సల్లగుండి
పాడి పంట ఇల్లు జేర
// ఎంకి//
రాగిచెంబు నీళ్ళు పోసి
రాజేషుడికి అభిషేకం
కోడె గట్టి మొక్కు దీర్చి
కోరికలే అడుగుదాము
// ఎంకి//
పసుపు కుంకాలు పెట్టి
పండ్లు గాజులు ఇచ్చి
అమ్మకు ఓడి బియ్యం
అప్పజెప్పి వద్దాం మనం
// ఎంకి//
పోశమ్మకు శాఖ పోషి
పొర్లుదండం బెడదాము
సల్లంగ సూడుమని
కోడిపిల్లను ఇడుద్దాం...
// ఎంకి//
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment