అంశం: నాగుల చవితి
తేది: 17- 11-2020
శీర్షిక: నాగ దేవత పూజనీయం ....
సంఖ్య: 45
హరిహరాదులకు ఆనందం
అమృతమయమగు కార్తీకం
సుందరమైన అంబరమంత
ఆవరించిన నక్షత్రములోలె
అవని నిండా దీపారాధన ....
హరికి శేష పాన్పుగా
హరునికి కంఠాభరణంగా
నరునికి శ్రేయోభిలాషుగా
అడుగడుగున పూజనీయం ...
సంతానార్ధులంతా సమ్మతించి కోరుదురు
సాగిలబడి కొలిచెదరు సాహో అని తలిచెదరు
పాలు, పండ్లు , గుడ్లు అర్పించి మొక్కెదరు
కార్తీక శుద్ధ చవితి రోజు నాగన్నకు -
నాగుల చవితియై విలసిల్లగా .....
అనువణువు ఈశ్వరాంశని
అమితంగా నమ్మకమే
పురాణేతిహాసాల పుణ్యవాక్కు
ఉపనిషత్తు సంహితల ఉవాచ ...
ప్రత్యక్షమో పరోక్షమో
ప్రధానమో నిదానమో
ఆచార సాంప్రదాయాల
ఆనవాళ్లే నాగదేవత పూజ ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment