అంశం: గేయం
తేది: 14-11-2020
శీర్షిక : దీపావళి
సంఖ్య : 562
అజ్ఞానపు చీకట్లను
ఆవలకు నెట్టేద్దాం
జ్యోతులను వెలిగించి
వెలుగుల్లో విహరిద్దాం
ఆచారం సంప్రదాయం
కలగలిసిన ఆధ్యాత్మికం
కొదువలేదు హైందవాన
కొండంత ఆత్మీయతలకు // అ//
వరాహుని కొడుకైనా
వరుసలో రాక్షసుడే
తల్లిచేత మృత్యువును
తనదిగ వరమొందెను // అ//
నరకాసురుడిగా
లోకాన కంఠకుడాయె
భూదేవే సత్యభామగా
మరు జన్మన వధియించె //అ//
అసుర సంహారం
ధర్మ ప్రతిష్టాపితం
సత్యం శివం సుందరమే
దీప ప్రజ్వలనం ... // అ //
దీపాలను వెలిగించి
ముగురమ్మల సేవించి
విఙ్ఞాన వివేక వినయాలను
సంకేతంగా స్వాగతిద్దాం // అ //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment