పరిష్కారమే పరమావధి
తేదీ: 15:01:2021
శీర్షిక : దెబ్బదేండ్లు ఎందుకు ?
సంఖ్య : 589
అవును కొంతమంది మాటలు
నోట ఊరే బెల్లం పానకమే....
తీయగా.... సాగుతూనే ఉంటాయి
సమస్య..... మాత్రం ఎప్పుడు గొంగలే.....
సాగునీటి ఆనకట్టల నిర్మాణంలా ....
పంట కాలువల మరమ్మతులలా .....
ప్రజల కుచేల సంతాన సమస్యలకు
పలు నాయకుల ఎన్నికల ప్రకటన
హామీల పత్రములా .....
తక్కెడ తలంపుల న్యాయానికి
చెల్లని నాణాల బోలు పెత్తనంలా
సాగతీతల పర్వంతో .... సాగనంపుట
తరాలు.... తరాలు.... తండ్లాటాలే.....
ఆరువందల అరువది పరాగణాలను
అవలీలగ కలిపే కదా...
మనసుపెట్టిన ఉక్కుమనిషి
ఆవిష్కరించ అఖండ భారతాన్ని.....
పాలకులంటే ప్రజా సేవకులమేనని
పరివ్రాజకులకు సంకేతించి
ప్రజల క్షేమమే ప్రధానంగా
పరిష్కారాలే పరమావధిగా
పరివారమంతా కదిలితే ......
దెబ్బదేండ్లు ఎందుకు ?
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment