Monday, July 26, 2021

ఏమి రాయగలను తేది : 06-11-2020

 అంశం : ఏమి రాయగలను

తేది : 06-11-2020
సవ్వడి సంఖ్య  : 34
శీర్షిక : ఏమైనా రాయగలను .... 

అవును ! 
ఏమైనా రాయగలను .... 

ఆత్మను నిలిపి అంకిత మౌతే 
అలవోకగ రాయగలను అమ్మ గూర్చి...
నమ్మకముగా అడుగులేస్తూ
నాన్న గూర్చి వ్రాయగలను ..
గుంభనంగా గురి కుదిరితే 
గురువుల గురించి కీర్తించగలను ....

అది ఇది యను అంతరమే లేక 
పసిమి వన్నెల ప్రత్యూషల అందాలు
మిణుగురులా మురిపించే నక్షత్ర మండలాలు
పిండి వెన్నెలారబోసే పున్నమ రాత్రులు 
ప్రకృతిలో పారాడే పదనిసలు ....

తొలకరిలో పులకరించే పుడమితల్లి 
వసంతములో చిగురించే కొమ్మా కోన  
కలకూజిత రాగాల కోయిల గానాలు
వర్ష ఋతువులోని చినుకుల సవ్వడులు
శిశిరంలో  ఆకు రాల్చిన అందాలు సైతం...

ఇంకా.... 
దేశ ప్రజలందరి ఆకలి ఆర్తి దీర్చు
అన్నదాతగ వర్దిల్లే హాలికుడు... 
మాతృ భూమి కర సేవకుడు 
మంచు కంచెల పోరాడే సైనికుడు...

వచన కవితలు చిత్ర కవితలు....
గేయ కవితలు పద కవితలు....
భక్తి కవితలు దేశ భక్తి కవితలు....
వరుసబెట్టి నేర్పుతుండె వ్రాసే వాలు..
గురువుగారు వివిధ కవితల 
విధానాలు విడమరిచి చెప్పుచూ...

నగునూరి రాజన్న
కరినగరము. 


No comments:

Post a Comment