అంశం : అడగరాదే
తేది : 13-11-2020
సవ్వడి సంఖ్య : 41
శీర్షిక : శాంతి సందేశం.....
విజ్ఞానమనే వింత విధానముతోనే
జీవకోటిలో భిన్నమయిన మనిషి
మేధోమదన దంపుళ్ళ వివేచనలే
పట్టు సాధించె పవిత్రమైన ప్రకృతి పైన .....
సంఘమై గంగలా వర్ధిల్లాలంటే
సంఘటితమై మనమంతా కదలాలి
సాధ్యా సాధ్యాల సమన్వయపు రాగాలు
సానుకూలతల మనోరంజకం సాధిస్తేనే.....
మాట మాటకో మనో భావంలా
మనిషికో అభిరుచుల భిన్నం
అడిగితేనే కదా అందరిదీ
ఒక్క మాటగా ఒక్క అడుగుగా
ముందుకు సాగేది ....
మొక్కవోని దీక్షా దక్షతల ప్రదర్శనే
ఉగ్రవాదపు ఉక్కు పిడికిలి నుండి
దేశమైనా విశ్వమైనా బయటపడి
శాంతి కపోతమై సందేశమివ్వ గలిగేది......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment