అంశం : కాలే కడుపు
తేది : 12-11-2020
సవ్వడి సంఖ్య : 40
శీర్షిక : పట్టింపు లేని పాలనలు
ఆసేతు హిమాచలం అన్నపూర్ణని
అఖండ భారతం రత్నగర్భయని
అమోఘమైన బిరుదులనేకములున్నా
ఆచరించాల్సిందల్లా దేశజనం...నాయకులు
అన్నం పరబ్రహ్మమనే
ఆచారం ఈ గడ్డమీదనే ...
ఆచరణలకు అమ్మానాన్నలో
అమలులో దేశభక్తి పాలకులో
నడుం కడితేనే మడుం మిగులు ...
తలసరి పంటలంటూ
తమాషా లెక్కల భారతం
ఓటు బ్యాంకు తోవలు అవన్నీ
ఒడువని పాలకుల ముచ్చట్లు ...
ఉన్నవాడికి తింటే సక్రమంగా అరగదు
లేని వాడికి తిండే కడుపుకు దొరకదు
సమన్వయం చేసే సమయాభావం
అంది పుచ్చుకుంటే అంతా సౌఖ్యమే...
స్వాతంత్య్రం వచ్చి సవాలక్ష నాళ్ళయినా
పౌష్టికాహారానికై పది రూపాయలు కావాలంటూ...
ప్రకటనలు జోరుగా దూరదర్శినిలో గుప్పిస్తుంటే
జుగుప్సలే చేతకాని స్వార్థ పాలనలపై....
కాలే కడుపుల కథా కమామీషులకు
కావాలంటే కళ్లెమేస్తారు ... కాని
పట్టింపులు లేని పాలనలకు
పదవులకన్నా ముఖ్యమేది కాదన్నది
నిదర్శనం ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment