Sunday, July 25, 2021

చిత్ర కవిత 12. Date: 07-12-2020 ( four pictures of north india winter season)

 చిత్ర కవిత 12.  

07-12-2020
శీర్షిక:  చలిపులి.... 
సంఖ్య : 576

ఏమాటకామాటే.... 
దక్షిణాదిలో దడ దడలాడించినా 
ఉత్తరాదిలో చలి ఉప్పెనే సుమా....
చలిపులి పంజాలో ప్రజలంత విలవిల 
మంచు దుప్పట్లు కప్పుకుని 
మాటు వేస్తుంది ప్రమాదాలకు .... 

అయినా ఆగని బ్రతుకు చక్రం 
కరోనా కస్సుబుస్సులకు కంచెగా
మాస్కులు ముక్కున బిగించుకుని
కరాళ నృత్యం చేస్తున్న చలికి
కవచంలా ఉన్ని దుస్తులు ధరించుకుని..... 

అందుకున్నదో పక్క స్వచ్ఛభారత్ 
అడుగులు కలిపింది ఆరోగ్యసమూహం
ఆగనన్నది అమృత క్షీర వాహనం 
సైకిలో.. మోటారో.. సవారీ గుర్రమో.... 
తగిలించుకుని పరుగు లంఘించుకునె.... 

చల్లబారిన ఉల్లములకు 
చలి మంటలే శరణ్యమంటూ 
మెలికలు తిరుగుతు మెటికలు విరుస్తూ 
శరణు జొచ్చిరి ఆడ మగా .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment