చిత్ర కవిత 11
తేది: 23-11-2020
సంఖ్య : 569
భరతమాతా వందనం
భావి ధాత్రీ వందనం
అందమయిన భారతం
ఆకారమై నిలువంగ
త్రిసంద్రములు సంగమమై
నీ పాద క్రాంతమాయె
ధాత్రీ జనయిత్రీ వందనం // భరత//
చిరు దరహాసినివై
మేరునగ ధీరవై
చిత్రంగా వామహస్తమున
త్రివర్ణ కేతనంతో
అభయములీయ రావే
ఆ దక్షిణ హస్తమున
అమ్మా మము బ్రోవుము // భరత //
లెక్కలేని దండయాత్రల
పిక్కటిల్లిన జనసంద్రం
మొక్కవోని ధైర్యాలకు
పెట్టింది పేరై నిలచే...
భిన్నత్వంలో ఏకత్వమై
ఒక్కటిగా నిలుపు తల్లీ // భరత //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment