గొలుసు కట్టు
తేది: 05-12-2020
సంఖ్య : 58
ఆత్మీయతల భావ వాహినికి
అంతరంగపు ఆవిష్కారం
అందమైన కావ్య కన్యకలా
అక్షరాలలోన నిక్షిప్తం
అనంతమైన భావ ప్రవాహం.....
ధరణీతలంపైన హలం కదలికలా
కలం ఎత్తకుండ పరుగెత్తిస్తూ
కాగితం సిరా కాల వ్యర్థాల నరికట్టే
కలిపి రాసే రాతల పెనవేతలు.....
బండారం బయటపడునన్న భయమో
విజ్ఞానము తస్కరింతురన్న గుబులో
నాడి పట్టిన నాటు వైద్యమును
నగ దీటుగా పోలకపోయినా
కోడి కెలికిన గొలుసుకట్టును మాత్రం
కొండొకచో బోలు నేటి వైద్యుల నవీన ఆంగ్లము...
సస్యశ్యామలమయ్యే సాగునీటికి
ప్రాణాధారమయ్యే తాగునీటికి
సాటిలేని మేటి సాంకేతిక పట్టు
పరిజ్ఞానపు మెట్టు విశ్వాన నేటికి
గొప్ప పట్టున్న గోత్రం ఆనాటి
కాకతీయుల అందమైన గొలుసుకట్టు
చెరువుల విధానం......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment