Wednesday, July 7, 2021

సగటు మనిషి గెలుపు తేది: 12-11-2020

 అంశం: సగటు మనిషి గెలుపు

తేది: 12-11-2020
శీర్షిక: గ్రహణం వీడి చేరదా... 
సంఖ్య : 560

సగటు మనిషి ఒక్కడి ఉనికి   
గడ్డిపోచలా ఒంటరే కావచ్చు ... 
పక్షుల సమూహమోలే వందలు దాటి  
దందెడయితే కోట దద్దరిల్లదా... 

ఫాదర్లు గోడ లాంటి గాడ్ ఫాదర్లు లేకపోవచ్చు
చమట చుక్కల స్వయంకృషిని నమ్ముకుని 
ఉడుం పట్టుదలలు పుణికి పుచ్చుకుంటే 
నిర్మలమైన నిష్కల్మషమైన సచ్చీలతలతో 
ముందు కెళ్తే సాధించలేని  సందెపోద్దేముంది ....

నీతి కలిగిన నిజ గమ్యాలకు 
నిజాయితీల పాద గమనాలకు 
నీ అడుగు కుసుమమే మొదటిదయితే
నిను చేరవా లక్షలు కోట్ల లతలు  తోడు.... 

స్వార్థం వీడిన  సర్వం సంధించుకుంటే 
పరమార్థం కలిగిన పరోపకారం పయనిస్తుంటే 
యదార్థం గ్రహించిన న్యాయపు నలుగురి చేరిక 
గ్రహణం వీడిన గెలుపే దరి చేరదా .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment