Sunday, July 25, 2021

డిల్లీలో రైతుల ఆందోళన తేది: 06-12-2020

 డిల్లీలో రైతుల ఆందోళన 

తేది: 06-12-2020
సంఖ్య : 59

సందేహాలకు తావులేని సందేశం 
అక్షరాలలో నిక్షిప్తమైనా కాకున్నా 
రైతెప్పుడూ రాజేననన్న ప్రమాణం 
జన హృదయాలలో నిలిచే నినాదం ... 

రాజకీయ కుళ్లుతో కాకుండా 
రైతు కళ్ళతో  చూడండంటూ 
జయప్రకాశ గారంతటి  వారే 
జయ జయ ద్వానాలు పలికే .... 

మంచి ఒక అడుగు వేసేలోపల 
అబద్దం ఆమడ పరుగెత్తినట్టు 
దెబ్బదేండ్ల దెబ్బలకు ములాం 
తట్టుకోలేని అసూయల కరాళం.... 

అందరి కోరిక ఆ రైతు సంక్షేమమే 
అందుకు మరోసారి సమీక్షిద్దాం 
అవసరమైన మార్పు చేర్పులతో 
ఆ కంట ఉబికే నీటికి ఆనకట్టలు వేద్దాం....  

అధికారం అటకెక్కితే 
తట్టుకోలేని కుటుంబ పాలకుల
ఉసికొల్పుల ఉత్సులలో పావులుగ 
ఉసురుకు ఎదురీదుతున్నారు..... 

అంది పుచ్చుకోవాల్సిందే....
అధికారపక్షం  ఆత్మీయతతో 
ప్రయత్నించవలసిందే ప్రతిపక్షం 
పక్షపాతం లేని  మానవత్వంతో .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment