Sunday, July 25, 2021

చేదునిజాలు తేది: 11-12-2020

 చేదునిజాలు

తేది: 11-12-2020
సంఖ్య: 63

సామాన్యుడు దేశ క్షేత్రంలో 
సంతానం సరిహద్దుల్లో పోరాటం
నాయకులు నట్టింట్లో నర్తిస్తే 
వారసులు  విదేశాల్లో విడిది చేస్తారు.... 

అచ్చెరువుగ పట్టాలు 
పుచ్చుకున్న జనం  
అక్షరాస్యతల జాడలు లేని 
అనామకులకు ఓటు మంత్రమేసి 
అభివృద్ధిని అత్యాశగ కోరుతారు .... 

జీవిత పర్యంత సేవలకు 
జీవనభృతులు కరువాయె 
అల్పకాల నాయక సేవలకు 
అనంత భృతుల రుచులాయె.... 

అధికారంలో ఉంటే అన్నీ సరే 
ప్రతిపక్షమైతే ప్రతీది కన్నెర్రే
మంచి చెడుల మాట మరిచి 
కాట కలిపే బాటలే శరణ్యం .... 

బాధ్యతల బందీలకంటే 
లబ్ద ప్రతిష్టల కీర్తి కిరీటాలే 
ముగ్ద మనోహరాలు కొందరికి 
ప్రజల బాగోగులు హుళక్కే ..... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment