Sunday, July 25, 2021

మనలో మాట తేది: 11-12-2020

 మనలో మాట 

తేది: 11-12-2020
శీర్షిక: మనస్సాక్షి
సంఖ్య: 579

సుద్ది బుద్దులు నేర్చిన 
సుందర సావకాశము
మొహమాటాల మోచేతి వాటం
ఎన్నో ఎన్నెన్నో సందర్భాలు ...

చిన్నా పెద్దల తారతమ్యాలంటూ
మర్యాద మన్ననల మాట కోసం 
సప్తవర్ణాలను సంతరించి
సన్నుతించిన సందర్భాలెన్నో.... 

ఎదుటివారిని గౌరవించడం 
ఎనలేని విలువల సంపదంటు
బాధలను బందీ చేసుకుని 
సుగంధాలను సుందరముగ అద్ది
ముందుతరాలకు అందించు ముద్దు
సంప్రదాయపు సంచీ తగిలించుకుని
తీర్చి దిద్దాడిన తీరులెన్నో..... 

ధూర్త మూర్ఖుల ముందు  
దూరలేక...బలవంతుల మాట 
బలిమిగ కాదను వాదనలు కథను 
ముగించవని కనుగొన్న తరుణాన
పట్టుబట్టలు కట్టిన వట్టి మాటలెన్నో ..... 

స్వార్థ చిట్టాలు సవరించుకుని
కాసులవేటలో కడతేర్చుకుని
కాని మాటలకు కక్కుర్తి బేరాలతో
మనస్సాక్షిని మట్టుబెట్టి మసిలెదరు 
మహిలోన మాయల కలియుగాన... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment