Sunday, July 25, 2021

మాయా లోకం. 10-12-2020

 మాయా లోకం. 

10-12-2020
సవ్వడి సంఖ్య: 62

ధర్మ పాదము చిన్నబోవు ఒంటరై 
ధరణి భారము పెరుగు తుంటరై 
సత్యయుగపు హరిశ్చంద్రులమని 
సన్నుతించి వరుసలు కలిపెదరు ...

ధవళ వస్త్రములు ధరియించి 
దమన నీతులకు తెరలు తీసి 
షరాబులుగా  చలామణవుతూ 
గరీబుల జేబులు వెతుకుతారు....

మమతల మతాబు వెలిగించే 
మాతృమూర్తుల పట్ల సైతం 
మారిపోయే విలువల నోట్లు
మకిలిచేష్టల కోట గోడలవుతాయి .... 

మంచినీటి  చెలిమెల 
చెలిమి.. వాకిట కూడా 
విష బిందువులను పాదు 
కొలిపే పున్నమి నాగులుంటాయి .... 

ఆత్మను మేలుకొలిపి 
అనితర వివేక వర్దనమొనరించి 
మాయల లోయలో జారకుండా 
నీవే తీరం చేరే దారి వెలుగవ్వాలి ..... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment