Sunday, July 25, 2021

వినిపించని వేదన తేది: 10-12-2020

 వినిపించని వేదన 

తేది: 10-12-2020
శీర్షిక: కాలుష్య రక్కసి 
సంఖ్య : 578

నిరక్షరాస్యతల నిట్టూర్పులో
అధిక జనాభాల అడ్డంకులో 
అలసత్వాల అలాయిబలాయిలో 
అనవరాల అవసర భ్రమలో .... 

స్వార్థ నీడల విషనాగులో 
అత్యాశల ముళ్ళ పల్లకీలో 
అవివేక ఆజ్యపు హవిస్సులో 
రంగులు మార్చే ఊసరవెల్లులో ....

విత్తనం కన్నా ముందే 
విష రసాయనాల ఆసరాలు
పంట నోటికందించే వరకు 
విచ్చలవిడి వింత ప్రవర్తనలు 
విశృంఖలత్వ విపరీత ధోరణిలు .... 

పెంట ఎరువుల మతి మరుపులో 
పంట దిగుబడుల కొంగ జపాలో 
కంటకమైన కల్తీ రసాయనాలో 
కంట నీరు కార్చే కారుణ్య శరణాలు ....

ఎక్కడ చూసినా ఆర్థనాదాలే 
ఏలూరు ఇప్పుడు..మనమెప్పుడో ..
ఎంతో సమయం పట్టదు 
ఎగబాకి మనదాకా చేర .... 

వీరంటే వారని వారంటే వీరని 
వంత పాటల వింత నాటకాలు 
మూలమేమిటో స్థూలత లేదు 
మూల్యం మాత్రం అమాయకజనం... 

పర్యవేక్షణ కరువైన  పరీక్షా సమయం.... 
నిలువనీయని నగ్న నిర్దారణలు
కనిపించని కామ పిశాచులు 
వినిపించని వేదన భరితాలు ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment