Sunday, July 25, 2021

రెక్కల సంతకం తేది: 09-12-2020

 రెక్కల సంతకం 

తేది: 09-12-2020
శీర్షిక: మాతృ దేశపు మమతలు. 
సంఖ్య : 577

ఆత్మీయతల స్పర్శలను 
మింగేస్తున్న అవసరాలో... 
అనుబంధాల పందిళ్ళకు 
అచ్చి రాని పరిస్థితులో.... 

స్వార్ధపు సంకెళ్లు తప్ప 
సంఘం బాగోగుల పట్టి లేని 
నీటి మూటల పాలకులో ... 
బంధు ప్రీతీ బంధనాలు తప్ప 
పారదర్శకతలు కరువైన 
ప్రభుత్వ విధానాలో ...... 

ఓటుబ్యాంకు రాబంధులు
పోటు పొడుపుల నిర్ణయాలో   
వర్ణాల వంకతో వదిలివేస్తున్న
నైపుణ్య కిరణాలను 
కాల రాస్తున్న తరుణములో .... 

కాటికి కాళ్ళు చాపే వయసున్న 
పెద్దలున్న  గూటికి దూరంగా 
బతుకు నూకల వెదుకులాటలో 
బహుదూరపు బాటసారులై
యువత రెక్కల సంతకాలు చేస్తూ
ఖండాలు దాటి తాము వెల్తుంటే... 

కారణమెవ్వరని కాలాన్ని ప్రశ్నిద్దామా?
కారణమే అక్కరలేని స్వయంకృషుల
సంధింపుల వారధి నిర్మాణాలతో 
మానవతలు నిండిన మాతృ దేశపు
మమతలను దశదిశల చాటుదామా.... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment