అంశం: మర మనిషి
తేది: 07-12-2020
సంఖ్య : 61
అడ్డాలనాడెమో అమ్మానాన్నలు
ఆనక వారకేమి తెలీదంటూంటాము
పుట్టి పెరిగిన జీవగడ్డను మరిచి
నిన్న మొన్న మన చుట్టూ పుట్టి
పెరిగిన మంచోళ్ళను గుర్తించం....
ఎక్కడో సుదూరాన ఉన్నది గొప్పంటూ
చెప్పుడు మాటలు వింటుంటాము...
చొప్పదంటు బాగోతం సాంతం
తెలియకపోయినా ఒప్పంటాము ....
చాలా మంది చేసే చద్దన్నం మూట
గుంటనక్కల తోడేళ్ళ బాట
గురి కుదురని పూబాలల తోట
ముందు ముందు మనకెదురవుతుందనే
సోయి లేని మాట .....
అమ్మపాలు మరిచి రొమ్ము గుద్దే రకము
ఆత్మీయతల అడ్రస్ గల్లంతు చేసుకుంటున్న
కట్టు పైసల బానిసలం .....
పక్కనున్న గొప్ప పవిత్రతను
నిక్కముగా గుర్తించలేని
పూజకు పనికిరాని వాసనలేని
పూవులం ....
ఒకవిధంగా మరమనుషులమే ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment