Sunday, July 25, 2021

నామ స్మరణ తేది08-01-2021

 అంశం: నామ స్మరణ 

తేది08-01-2021
సంఖ్య: 71 

అలవికాని ఆలోచనల 
అబేధ్యపు అంతరంగం 
నిత్యం తలమునకలయ్యే 
తలంపులు తలస్నానాలు ...

అమోఘమైన అనుభవాల 
అనుసంధానతల సమ్మేళనం
అపురూపమైన సంస్కారం  
అనుసరణీయ సంప్రదాయం.... 

ఓంకారమే ఒడువని సాదృశ్యం 
మనసు కుసుమాన్ని మందిరం చేసి 
పంచేంద్రియాలను పగ్గంతో పదిలపరిచి 
సన్మార్గమునకు సావధానపరచడమే .... 

నమ్ముకున్న  కొండంత దైవాన్నో 
నమ్మకమిచ్చే అండంత శక్తినో 
తనువూ మనసులు తదేకమై కలిపి
నిలిపి చేసే నిరంతర స్మరణలే ..... 

నామోచ్చారణల ప్రకంపనలు 
అదృశ్య  ఆరావళిని బాగుచేసి
ఆరోగ్యాలకు అడ్డుగోడలై అమరు
ఆధ్యాత్మికాల ఆసరాలతో అజేయమౌ.... 

నవరంధ్రాల నాడీమండలం 
ప్రశాంతమై పరిణతి సాధించు 
ఆరోగ్యాల ఆఖరి మెట్టందించు 
అదేకదా అసలు ముక్తికి సోపానం... 

నగునూరి రాజన్న
కరినగరము. 


No comments:

Post a Comment